

మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఈ నెల 27 నుంచి పాదయాత్ర చేపట్టనున్నారు. జవహర్‌నగర్ డంప్‌యార్డును అక్కడి నుంచి తరలించాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. డంప్‌యార్డు నుంచి వెలువడుతున్న మీథేన్ వాయువు కారణంగా స్థానిక ప్రజలు అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై ప్రభుత్వాలు తగిన శ్రద్ధ చూపడం లేదని విమర్శించారు.
ఈ సమస్యపై తదుపరి కార్యాచరణకు ఈటల రాజేందర్ సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 23న జవహర్‌నగర్ డంప్‌యార్డు బాధితులతో సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం 25న మేధావులు, పర్యావరణవేత్తలతో కలిసి డంప్‌యార్డు ప్రాంతంలోనే రౌండ్‌టేబుల్ సమావేశం ఏర్పాటు చేయనున్నారు. స్థానికుల సమస్యలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు డంప్‌యార్డు తరలింపు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడమే ఈ కార్యక్రమాల లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!