

రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు శుభవార్త. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో, దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఫౌజీ’ నుంచి త్వరలో ప్రత్యేక అప్‌డేట్ రానుంది. ‘దొంగ నా కొడుకు’ సినిమా వేడుకలో పాల్గొన్న నటుడు మౌళి.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత వై. రవిశంకర్‌ను సినిమా అప్‌డేట్ గురించి సరదాగా ప్రశ్నించారు. ఈ చిత్రానికి సంబంధించిన వివరాల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని ఆయన ప్రస్తావించడంతో అక్కడ నవ్వులు పూశాయి.
మౌళి ప్రశ్నకు స్పందించిన రవిశంకర్.. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ‘ఫౌజీ’ నుంచి ప్రత్యేక వీడియో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ వీడియోలో సినిమా నేపథ్యం, ప్రభాస్ పాత్ర స్వభావం, కథ ఏ కాలంలో సాగుతుందనే అంశాలకు సంబంధించిన వివరాలు ఉండనున్నట్లు తెలిపారు. భారీ యాక్షన్ సన్నివేశాలతో కూడిన గ్లింప్స్ కంటే, సినిమా ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసే సమాచారాత్మక వీడియోగా ఇది ఉండనుందని వివరించారు. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లతో పాటు మైత్రీ మూవీ మేకర్స్ సినిమాలు ప్రదర్శితమవుతున్న థియేటర్లలోనూ ఈ వీడియోను ప్రదర్శించనున్నట్లు పేర్కొన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!