
జనరల్

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విదేశీ పర్యటన మరోసారి రాజకీయంగా చర్చనీయాంశమైంది. సీఈసీ జ్ఞానేశ్ కుమార్, ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా దిల్లీలో నిరసనలు కొనసాగుతున్న సమయంలో రాహుల్ విదేశాలకు వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నేపథ్యంలో రాహుల్ పర్యటనపై తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌ను విలేకర్లు ప్రశ్నించగా, ఆయన వ్యంగ్యంగా స్పందించారు.
‘‘నేనేమీ ట్రావెల్ ఏజెంట్‌ను కాదు. ఆ ప్రశ్న నన్ను అడిగి ప్రయోజనం లేదు. నేను దిల్లీని వదిలి ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చాను? ప్రతి ఒక్కరికీ కొన్ని బాధ్యతలు ఉంటాయి. దీనిపై నేను ఏమీ మాట్లాడదలుచుకోలేదు’’ అని శశిథరూర్ బదులిచ్చారు. మరోవైపు, దిల్లీలో నిరసనలు జరుగుతున్న సమయంలో రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లడంపై భాజపా విమర్శలు గుప్పించింది. ఆయన వియత్నాం వెళ్తున్న విమానంలో ఉన్నారంటూ ఓ వీడియోను ఎక్స్‌లో పోస్టు చేసింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!