
జనరల్

తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధినేత విజయ్ పార్టీ కార్యకర్తలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. బహిరంగ ప్రదేశాల్లో బ్యానర్లు, కటౌట్లు ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బందులు కలిగించొద్దని స్పష్టం చేశారు. పార్టీ కార్యక్రమాలు, వేడుకల్లో క్రమశిక్షణ పాటించాలని కార్యకర్తలకు సూచించారు.
పార్టీ పేరుతో ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని విజయ్ హెచ్చరించారు. ప్రజా భద్రత, సామాజిక బాధ్యతను దృష్టిలో పెట్టుకుని ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు తమిళనాడులో చర్చనీయాంశంగా మారాయి. విజయ్ నిర్ణయాన్ని పలువురు అభినందిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!