

తమిళనాడు, పశ్చిమబెంగాల్ అసెంబ్లీ నియోజకవర్గాలకు గురువారం పోలింగ్ కొనసాగుతోంది. పశ్చిమబెంగాల్‌లో తొలి విడతలో భాగంగా 152 స్థానాల్లో ఓటింగ్ జరుగుతుండగా, తమిళనాడులో మొత్తం 234 స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. ఉదయం 9 గంటల వరకు తమిళనాడులో 17.69 శాతం, పశ్చిమబెంగాల్‌లో 18.76 శాతం ఓటింగ్ నమోదైంది. గుజరాత్‌లోని ఉమ్రెఠ్, మహారాష్ట్రలోని బారామతి, రాహురీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం నుంచే పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించారు.
తమిళనాడులో శివగంగలో కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం ఓటేశారు. భాజపా నేత ఖుష్బూ, నటి త్రిష చెన్నైలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. టీవీకే చీఫ్ విజయ్ చెన్నైలో ఓటేశారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఆయన భార్య దుర్గా స్టాలిన్, కుమారుడు ఉదయనిధి స్టాలిన్ చెన్నైలో ఓటేశారు. నటులు విక్రమ్, ధ్రువ్ విక్రమ్, ఎంఎన్‌ఎం చీఫ్ కమల్ హాసన్, ఆయన కుమార్తె శ్రుతి హాసన్, అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఓటేశారు. నటుడు అజిత్ చెన్నైలోని తిరువన్మియూర్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయన వ్యాఖ్యలపై వచ్చిన వార్తలను ఆయన మేనేజర్ ఖండించారు.
















.jpg&w=3840&q=75)





కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!