

దేశ ఆర్థిక వ్యవస్థను స్థిరంగా ముందుకు తీసుకెళ్లేలా కేంద్ర బడ్జెట్‌ను రూపకల్పన చేశామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, రైతులకు అండగా నిలిచేందుకు ఎరువులపై రాయితీని పెంచినట్లు చెప్పారు. ఈ నిర్ణయం తెలంగాణ రైతులకు కూడా ప్రయోజనం చేకూరుస్తుందన్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి బడ్జెట్ పరిమాణం పెరిగిందని, కాకతీయ టెక్స్టైల్ పార్క్‌కు లబ్ధి చేకూరేలా కేంద్రం ప్రత్యేక పథకాన్ని తీసుకొచ్చిందని పేర్కొన్నారు. ప్రతి జిల్లాలో బాలికల హాస్టళ్లు ఏర్పాటు చేయనున్నట్లు, తెలంగాణలోని 33 జిల్లాలకు వాటి మంజూరు ఉంటుందని తెలిపారు. డేటా సెంటర్లకు ఇచ్చే ప్రోత్సాహం వల్ల తెలంగాణకు లాభం చేకూరుతుందని, విదేశీ విద్యపై పన్నును 5 శాతం నుంచి 2 శాతానికి తగ్గించడం వల్ల తెలుగు విద్యార్థులకు మేలు జరుగుతుందని చెప్పారు.
రైల్వే బడ్జెట్‌ను రూ. 2.77 లక్షల కోట్లకు పెంచినట్లు, రాష్ట్రానికి మూడు హైస్పీడ్ రైళ్లు రానున్నాయని కిషన్ రెడ్డి వెల్లడించారు. మెట్రో రైలు విషయంలో డీపీఆర్ అందిస్తే పట్టణాభివృద్ధి శాఖ నిధులు కేటాయిస్తుందని, మంత్రివర్గ ఆమోదంతో కేంద్రం సహకరిస్తుందని స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసుపై స్పందిస్తూ, అది టీవీ సీరియల్లా కొనసాగుతోందని వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ నిజమని కేసీఆర్ కుటుంబ సభ్యులే చెప్పినట్లు, న్యాయస్థానాల అఫిడవిట్లలోనూ ఇదే అంశాలు ఉన్నాయని తెలిపారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!