
జనరల్

మంచిర్యాలలో నిర్వహించిన కార్మికుల సమావేశంలో టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో అడవుల్లో మావోయిస్టులు ఉన్న సమయంలో ప్రజలకు, కార్మికులకు ధైర్యం ఉండేదని, సింగరేణి అధికారులు కూడా మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించేవారని ఆమె పేర్కొన్నారు.
ప్రస్తుతం అడవిలో అడిగే వారు లేరనే భావనతో సింగరేణి యాజమాన్యం వ్యవహరిస్తోందని కవిత విమర్శించారు. అయితే గతంలో అడవుల్లో ఉన్న అన్నలంతా ఇప్పుడు టీఆర్ఎస్ ఉద్యమంలోనే ఉన్నారని వ్యాఖ్యానించారు. కార్మికుల హక్కులకు భంగం కలిగించే ఏ చర్యనైనా తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, కార్మికుల సంక్షేమం కోసం పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!