

వనరుల పరంగా ఎంతో కీలక దీవి అయిన గ్రీన్లాండ్ (Greenland)ను చేజిక్కించుకుంటామంటూ ట్రంప్ (Trump) చేస్తున్న హెచ్చరికలను గ్రీన్లాండ్, డెన్మార్క్‌లతో పాటు ఐరోపా దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డెన్మార్క్ (Denmark)పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రీన్లాండ్ భద్రతకు రష్యా నుంచి ముప్పు ఉందని నాటో గత 20 ఏళ్లుగా హెచ్చరిస్తున్నా, డెన్మార్క్ సరైన చర్యలు తీసుకోలేదని ఆయన ఆరోపించారు.
డెన్మార్క్ భద్రత విషయంలో విఫలమైందని, అందుకే భద్రతా కారణాల దృష్ట్యా అమెరికా జోక్యం అవసరమైందని ట్రంప్ తెలిపారు. “ఇప్పుడు సమయం వచ్చింది” అని చెబుతూ, ఎలాగైనా గ్రీన్‌లాండ్‌ను చేజిక్కించుకుంటామని స్పష్టం చేశారు. గ్రీన్లాండ్ విషయంలో అమెరికాకు మద్దతు ఇవ్వని దేశాలపై అదనంగా 10 శాతం సుంకాలు విధిస్తామని ట్రంప్ ప్రకటించడంతో బ్రిటన్, ఈయూ దేశాలు తీవ్రంగా స్పందించాయి.
ఈ అంశంపై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ స్పందిస్తూ, ట్రంప్ బెదిరింపులకు లొంగేది లేదని, గ్రీన్లాండ్ ఎప్పటికీ డెన్మార్క్‌లో భాగమేనని స్పష్టం చేశారు. ఐరోపా యూనియన్‌కు చెందిన వాణిజ్య ఆయుధం ‘ట్రేడ్ బజూక’(Trade bazooka)ను తొలిసారి వాడాలని యోచిస్తున్నట్లు తెలిపారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!