

తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి సామ రామ్మోహన్ రెడ్డిని, నల్గొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిని అభ్యర్థులుగా కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించింది. సెప్టెంబర్ 29న కాంగ్రెస్ అధిష్ఠానం ఈ రెండు పేర్లకు ఆమోదం తెలిపింది.
ఈ రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ప్రస్తుత సభ్యుల పదవీకాలం మార్చి 2027లో ముగియనుంది. దీంతో వచ్చే ఏడాది మార్చిలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఓటర్ల నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత కలిగిన పట్టభద్రులు ఫారం-18 ద్వారా తమ పేర్లను ఓటర్ల జాబితాలో నమోదు చేసుకోవాలి. డిసెంబర్ 30, 2026న తుది ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు. ఎన్నికల పోలింగ్‌కు సంబంధించిన ఖచ్చితమైన తేదీలను ఎన్నికల సంఘం ప్రత్యేకంగా ప్రకటించనుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!