

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా, దీపికా పదుకొనే కథానాయికగా దర్శకుడు అట్లీ రూపొందిస్తున్న భారీ పాన్ వరల్డ్ చిత్రం ‘రాకా’పై ప్రేక్షకుల్లో ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. ‘పుష్ప’ విజయాల తర్వాత అల్లు అర్జున్ నుంచి వస్తున్న ఈ ప్రాజెక్ట్ కావడంతో దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా దీనిపై ప్రత్యేక దృష్టి నెలకొంది. భారీ నిర్మాణ వ్యయంతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కిస్తున్నట్లు ఇప్పటికే చిత్రబృందం వెల్లడించింది. ఇదిలా ఉండగా, ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన సంగీతంపై ఆసక్తికర సమాచారం సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ ఇప్పటికే ప్రధాన గీతాల స్వరరచన పూర్తి చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
అంతేకాదు, కథలోని కీలక ఘట్టాలకు అనుగుణంగా వినిపించే నేపథ్య బిట్ ట్రాక్‌ల రూపకల్పన కూడా ప్రస్తుతం వేగంగా సాగుతోందని తెలుస్తోంది. అట్లీ సినిమాల్లో సంగీతానికి ఎంత ప్రాధాన్యం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈసారి కూడా కథకు బలాన్నిచ్చే ఆల్బమ్ సిద్ధం చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు చిత్రీకరణ కూడా ప్రణాళిక ప్రకారం కొనసాగుతుండగా, విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ ఎపిసోడ్‌లపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం. సన్ పిక్చర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం అల్లు అర్జున్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందనే అంచనాలు ఇప్పటికే ఏర్పడ్డాయి. అధికారిక ప్రకటనలు వెలువడకముందే వస్తున్న ఈ వార్తలు అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!