
సినిమాలు

తెలుగుదేశం పార్టీ తరఫున రాజ్యసభ ఎన్నికలకు ఎంపికైన చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ, సానా సతీష్లకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీ-ఫారంలను అందజేశారు. పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎన్నికల్లో విజయం సాధించాలని ఆకాంక్షించారు.
రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపికైన ఈ ముగ్గురు నేతలు రేపు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. పార్టీ తరఫున వీరి ఎంపిక రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకోగా, టీడీపీ శ్రేణులు కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాయి. నామినేషన్ ప్రక్రియ అనంతరం ఎన్నికల ప్రక్రియ మరింత వేగం పుంజుకోనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!