
సినిమాలు

కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని తన నిరాహార దీక్షను విరమించారనే ఆరోపణలను సోనమ్ వాంగ్‌చుక్ తీవ్రంగా ఖండించారు. వీడియో సందేశం విడుదల చేసిన ఆయన, ఇలాంటి వ్యాఖ్యలు చాలా బాధాకరమని అన్నారు. ఒకవేళ ఒప్పందం చేసుకోవాలనుకుంటే ఢిల్లీ ఎండలో 26 రోజుల పాటు రోడ్డుపై నిరాహార దీక్ష చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.
తన దీక్ష పూర్తిగా పవిత్రమైనదని, ఈ పోరాటంలో 11 కిలోల శరీర బరువు కోల్పోయానని వాంగ్‌చుక్ తెలిపారు. ఇంత త్యాగం చేసిన తర్వాత కూడా తన నిజాయతీని నిరూపించుకోవాల్సి వస్తోందా అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీశాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!