

సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్‌పల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టి. హరీశ్ రావు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కల్లాల్లో రోజుల తరబడి ఎదురుచూస్తున్న రైతుల సమస్యలను స్వయంగా తెలుసుకున్న ఆయన, ప్రభుత్వం మిషన్ మోడ్‌లో కాకుండా కమిషన్ మోడ్‌లో పనిచేస్తోందని ఆరోపించారు. మరో రెండు రోజుల్లో వడ్ల కొనుగోళ్లు వేగవంతం చేయకపోతే వేలాది మంది రైతులతో కలిసి కలెక్టరేట్‌ను ముట్టడిస్తానని హెచ్చరించారు.
ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఢిల్లీ ట్రిప్పులు, గారడీ మాటలు మానేసి కొనుగోలు కేంద్రాలకు లారీల సంఖ్య పెంచాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. క్వింటాల్‌కు ఐదు కిలోల తరుగుతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నా అధికారులు, మంత్రులు పట్టించుకోవడం లేదన్నారు. సిద్దిపేట గడ్డపై 45 రోజుల్లో పూర్తి రైతుబంధు ఇస్తామని చెప్పిన సీఎం, 63 రోజులు గడిచినా ఆ హామీని నెరవేర్చలేదని విమర్శించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!