

ఆంధ్రప్రదేశ్లో గ్రామాలను మున్సిపాలిటీల్లో విలీనం చేసే నిర్ణయంపై సుప్రీంకోర్టు స్పందించింది. ఈ విలీనాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం, ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. గ్రామాలను మున్సిపాలిటీల్లో విలీనం చేసే ప్రక్రియను సవాలు చేస్తూ పిటిషనర్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరిని తెలియజేయాలని సుప్రీంకోర్టు నోటీసుల ద్వారా కోరింది.
గ్రామ పంచాయతీల తీర్మానాలు, ఆమోదం తీసుకోకుండానే విలీన ప్రక్రియ చేపట్టారని పిటిషనర్లు తమ వాదనల్లో పేర్కొన్నారు. ఈ క్రమంలో చట్టపరమైన నిబంధనలను, నిర్దేశిత ప్రక్రియను పాటించలేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు, మున్సిపాలిటీల్లో గ్రామాల విలీనం తమ తుది తీర్పునకు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తదుపరి న్యాయపరమైన పరిణామాలపై ఆసక్తి నెలకొంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!