

ఎం. కె. స్టాలిన్ తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడిన స్టాలిన్, ప్రస్తుత ప్రభుత్వ స్థిరత్వంపై ప్రజల్లోనే సందేహాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. మూడు నెలలైనా ఈ ప్రభుత్వం కొనసాగుతుందా అనే చర్చ ఇప్పటికే ప్రారంభమైందని పేర్కొన్నారు. తమ కూటమి పార్టీల మద్దతుతోనే ప్రభుత్వం కొనసాగుతోందని ఆయన ఆరోపించారు.
ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఆరు నెలలు విమర్శించకూడదని తమ పార్టీ నిర్ణయించుకుందని, అయితే ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలు ఆ నిర్ణయాన్ని పునఃపరిశీలించే పరిస్థితిని తీసుకొచ్చాయని స్టాలిన్ తెలిపారు. ప్రజలను నేరుగా కలవకుండా, బూత్ ఏజెంట్లను కూడా సమర్థంగా నియమించకుండా విజయం సాధించిన పార్టీ ఎక్కువకాలం నిలబడటం కష్టమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!