
గాసిప్స్

దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై స్పీకర్ ఎదుట విచారణ జరిగింది. ఈ సందర్భంగా మహేశ్వర్ రెడ్డి తరపున ఆయన న్యాయవాదులు స్పీకర్ ముందు హాజరయ్యారు. దానం నాగేందర్ పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారనే అంశానికి సంబంధించిన ఆధారాలను మహేశ్వర్ రెడ్డి తన న్యాయవాదుల ద్వారా స్పీకర్‌కు సమర్పించారు.
ఈ విచారణలో తాను స్వయంగా స్పీకర్ ఎదుట క్రాస్ ఎగ్జామినేషన్‌కు హాజరవ్వాలనుకుంటున్నట్లు మహేశ్వర్ రెడ్డి తెలియజేశారు. ఇందుకు వచ్చే నెల 20 వరకు గడువు ఇవ్వాలని ఆయన అభ్యర్థించారు. మహేశ్వర్ రెడ్డి విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న స్పీకర్, ఈ కేసు విచారణను వచ్చే నెల 18వ తేదీకి వాయిదా వేశారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!