

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామా అనంతరం శుక్రవారం నాడు న్యూఢిల్లీ లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు, మంత్రివర్గ కూర్పు అంశాలపై ఈ సమావేశంలో చర్చలు జరిగాయి. తన రాజకీయ భవిష్యత్తుపై కూడా సిద్ధరామయ్య చర్చించినట్లు సమాచారం. రాజ్యసభకు వెళ్లాలనే ఆసక్తి లేదని, కర్ణాటక రాజకీయాల్లోనే కొనసాగాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
ఈ సమావేశంలో సిద్ధరామయ్య తన కుమారుడు యతీంద్రకు కీలక మంత్రిత్వ శాఖ కేటాయించాలని కోరినట్లు తెలుస్తోంది. ఆరోగ్యం, విద్య, వెనుకబడిన తరగతుల సంక్షేమం వంటి ముఖ్య శాఖలపై ఆయన ఆసక్తి చూపినట్లు సమాచారం. అలాగే తన అనుచరులకు కూడా మంత్రివర్గంలో చోటు కల్పించాలని, ఎమ్మెల్సీ నియామకాలు, కేబినెట్ పదవులపై నేతల జాబితాను సమర్పించినట్లు వెల్లడించారు. అనంతరం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో కూడా ఆయన సమావేశమయ్యారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!