

హైదరాబాద్లో జరిగిన రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్స్ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన హాస్యంతో, మాట తీరుతో ప్రేక్షకుల్ని మరోసారి ఆకట్టుకున్నారు. ఈ సందర్భంలో 2009 ఏకీకృత ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో రామోజీ రావుతో తనకు జరిగిన ఒక ఆసక్తికర సంఘటనను ఆయన పంచుకున్నారు.
“2009లో ఎన్నికల ఫలితాల ముందు, టీడీపీ ప్రభుత్వంలోకి వస్తుందని, రామోజీ గారి సిఫారసుతో మంత్రివర్గంలో చోటు దక్కుతుందని అప్పట్లో ఓ మాట ఉండేది. అందుకే నేను, ఇంకా నలుగురు నాయకులు రామోజీ గారిని కలిశాం. మాట్లాడకముందే మా ఉద్దేశం ఆయనకు అర్థమైపోయింది” అని రేవంత్ అన్నారు.
అప్పుడు రామోజీ రావు, “నేను ఎప్పుడూ ఎవరికీ మంత్రిపదవులు సిఫారసు చేయలేదు. నాయకుడి అసలు శక్తి ఎమ్మెల్యేగా బలంగా నిలబడడంలోనే ఉంది” అని సలహా ఇచ్చారని రేవంత్ తెలిపారు. ఆశ్చర్యకరంగా, రేవంత్ ఎప్పుడూ మంత్రి కాలేకపోయినా, నేరుగా ముఖ్యమంత్రి అయ్యారు. రామోజీ చెప్పిన మాటలే చివరికి ఆయన జీవితంలో నిజమయ్యాయని రేవంత్ హాస్యంగా వ్యాఖ్యానించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!