

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గోదావరి జలాలను అడ్డం పెట్టుకుని అప్పటి భారాస ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో రాష్ట్రాన్ని కొల్లగొట్టిందని తీవ్ర ఆరోపణలు చేశారు. నిజామాబాద్ జిల్లా బర్దీపూర్ శివారులో నిర్వహించిన ప్రజాపాలన–ప్రగతిబాట బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, రూ.లక్ష కోట్లు దిగమింగిన కేసీఆర్ మరియు కేటీఆర్‌లను కాపాడుతున్నది ఎవరో చెప్పాలని భాజపా నేతలను ప్రశ్నించారు. కాళేశ్వరాన్ని ‘ఏటీఎం’గా మార్చారని గతంలో ప్రధాని మోదీ, అమిత్‌షా చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ, ఆరు నెలల క్రితమే ఈ అంశాన్ని సీబీఐకి అప్పగించినా చర్యలు ఎందుకు లేవని నిలదీశారు.
భారాస–భాజపాలది విడదీయరాని బంధమని, వీరిలో ఎవరు గెలిచినా ఫలితం ఒక్కటేనని సీఎం వ్యాఖ్యానించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని పిలుపునిచ్చారు. తమ ప్రభుత్వ హయాంలో కొత్త రేషన్‌కార్డులు మంజూరు చేసి 3.12 కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తున్నామని, 50 లక్షల పేద కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, స్వయం సహాయక సంఘాలకు రుణాలు, 70 వేల ఉద్యోగాలు కల్పించినట్లు తెలిపారు. అన్ని వర్గాలను సమన్వయం చేస్తూ తెలంగాణను నంబర్‌వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!