
రాజకీయాలు

అన్నాడీఎంకే పార్టీకి తమిళనాడులో భారీ రాజకీయ షాక్ తగిలింది. రెబల్ ఎమ్మెల్యేలు కుమార్ వెల్, జై కుమార్, సత్యభామ చెన్నైలో స్పీకర్‌కు తమ రాజీనామాలు సమర్పించారు. పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాల మధ్య ఈ నిర్ణయం తీసుకోవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
బలపరీక్ష సమయంలోనే టీవీకే కు మద్దతు ప్రకటించిన ఈ ఎమ్మెల్యేలు, ఇప్పుడు ఉప ఎన్నికల్లో టీవీకే తరఫున పోటీ చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇదే సమయంలో మంత్రి అదవ్ అర్జున్‌తో వారు భేటీ కావడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పరిణామాలు అన్నాడీఎంకే నాయకత్వానికి కొత్త సవాళ్లు తీసుకురానున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!