
క్రీడలు

ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభ సీట్ల కేటాయింపు వ్యవహారం తెలుగుదేశం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. రాజ్యసభ సభ్యత్వాన్ని ఆశించిన కడప జిల్లా టీడీపీ సీనియర్ నేత రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి అవకాశం దక్కకపోవడంపై బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. గత 13 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడి పనిచేసినా, తనకు ఇచ్చిన హామీ అమలు కాలేదని సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ వ్యవహారం పార్టీ వర్గాల్లో చర్చకు దారితీయగా, కొద్దిసేపటికే శ్రీనివాసరెడ్డి చేసిన మరో సోషల్ మీడియా పోస్ట్ రాజకీయంగా ఆసక్తి రేపింది. పెండింగ్ బిల్లుల చెల్లింపుల అంశాన్ని ప్రస్తావిస్తూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలు రాజ్యసభ సీట్ల కేటాయింపు అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చను మరింత వేడెక్కించాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!