
జనరల్

టీవీకే ఎమ్మెల్యే నిర్మల్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. వామపక్ష పార్టీలు, వీసీకే తమకు మద్దతు ఇస్తాయని నమ్మకం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వామ్యానికి అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు. ఎన్డీఏ కూటమిలోని పార్టీలతో ఎలాంటి సంప్రదింపులు జరపబోమని, అలాంటి ఉద్దేశం తమకు లేదని తెలిపారు.
ఇదిలా ఉండగా టీవీకే నేత నిర్మల్ కుమార్ వీరపాండియన్‌తో సమావేశమయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలని కోరనున్నట్లు సమాచారం. స్టాలిన్‌తో సమావేశం తర్వాత వామపక్ష పార్టీల వైఖరిలో మార్పులు కనిపిస్తున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రేపు జరగనున్న వామపక్షాల కార్యవర్గ సమావేశం అనంతరం తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!