

బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రతిష్ఠను దెబ్బతీసేలా కొండపోచమ్మ సాగర్ నీటిని ఆయన ఫామ్‌హౌస్‌కు మళ్లించారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ ముగ్గురు కాంగ్రెస్ నేతలకు బీఆర్‌ఎస్ లీగల్ సెల్ నోటీసులు జారీ చేసింది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ గడ్డం వంశీకృష్ణలకు ఈ నోటీసులు పంపించింది. బీఆర్‌ఎస్ జనరల్ సెక్రటరీ, లీగల్ సెల్ ఇన్‌ఛార్జ్ సోమ భరత్ కుమార్ ఈ నోటీసులు జారీ చేశారు. ఇదే అంశంపై గతంలో వెలుగు దినపత్రిక యాజమాన్యం, ఎడిటర్‌కు కూడా నోటీసులు పంపినట్లు బీఆర్‌ఎస్ వర్గాలు తెలిపాయి.
తమ సోషల్ మీడియా ఖాతాల్లో ఈ అంశానికి సంబంధించిన పోస్టులను తక్షణమే బేషరతుగా తొలగించి, ప్రచారాన్ని ఉపసంహరించుకోవాలని బీఆర్‌ఎస్ లీగల్ సెల్ డిమాండ్ చేసింది. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై నిరాధార ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను సహించబోమని స్పష్టం చేసింది. నోటీసులకు స్పందించకపోతే పరువు నష్టం సహా వర్తించే చట్టాల ప్రకారం తదుపరి న్యాయపరమైన చర్యలు చేపడతామని హెచ్చరించింది. ఈ వ్యవహారంలో బీఆర్‌ఎస్ చేసిన ఆరోపణలు, నోటీసులపై కాంగ్రెస్ నేతల స్పందనకు సంబంధించిన వివరాలు అందుబాటులో లేవు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!