
రాజకీయాలు

పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీ నడపడం అంత సులభం కాదని పేర్కొన్నారు. కుల రాజకీయాల గురించి మాట్లాడుతున్నానని తనను విమర్శిస్తున్న వారిపై స్పందిస్తూ, మిగతా రాజకీయ నాయకులు కులం గురించి మాట్లాడటం లేదా అని ప్రశ్నించారు. తాను ఎంతో ఓపికతో వ్యవహరించినప్పటికీ విమర్శలు ఆగలేదని చెప్పారు. తమిళనాడులో రాజకీయాలు ఎంతో సాఫీగా సాగడం చూసి తనకు అసూయ కలిగిందని కూడా వ్యాఖ్యానించారు.
అమిత్ షా తో జరిగిన చర్చలపై వస్తున్న ప్రచారాన్ని ఖండించిన పవన్ కళ్యాణ్, బయటివారికి ఆ సమావేశాల్లో జరిగిన విషయాలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. వైసీపీ నేతను జైలుకు పంపాలని తాను కోరినట్లు జరుగుతున్న ప్రచారాన్ని తిరస్కరించిన ఆయన, ఎవరో ఒకరు జైలుకు వెళ్తే జనసేన లేదా తాను ఎదగబోమన్నారు. వ్యక్తులపై కక్ష సాధించడానికి కాదు, మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!