
క్రీడలు

పవన్ కళ్యాణ్ ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని జనసేన పార్టీ కమిటీలను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ విధివిధానాలకు విరుద్ధంగా కొందరు జిల్లా నాయకులు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు, మద్దతుదారుల నుంచి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. పార్టీ క్రమశిక్షణకు భంగం కలిగించే చర్యలను సహించబోమని స్పష్టం చేశారు.
దీంతో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని జిల్లా, నగర, మండల, గ్రామ స్థాయి కమిటీలన్నింటినీ తక్షణమే రద్దు చేసినట్లు ప్రకటించారు. క్రమశిక్షణ లేని చోట పార్టీ వ్యవస్థ సమర్థంగా పనిచేయలేదని పేర్కొన్న పవన్ కళ్యాణ్, గతంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా కమిటీలను కూడా ఇదే కారణంతో రద్దు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. కొత్త కమిటీలు నియమించేవరకు జిల్లా పార్టీ వ్యవహారాలను జనసేన కేంద్ర కార్యాలయం నేరుగా పర్యవేక్షిస్తుందని తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!