
క్రీడలు

తన అనుమతి లేకుండా తన పేరుపై ఎవరూ ఎలాంటి సంస్థను ఏర్పాటు చేయరాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. కేటీఆర్ సేవా సమితి, కేటీఆర్ సేన పేరుతో కొందరు పలు కార్యకలాపాలు చేపడుతున్న విషయం తన దృష్టికి రావడంతో ఆయన సోమవారం ఈ విధంగా స్పందించారు.
ఈ నేపథ్యంలో తన పేరుతో ఎలాంటి సంస్థలకీ అనుమతి లేదని, అలాంటి ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించబోమని తెలిపారు. ఇలాంటి సంస్థలకు ఎటువంటి గుర్తింపు, అనుమతి లేదన్న విషయాన్ని అందరూ గుర్తించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎవరైనా పనిచేయాలనుకుంటే కచ్చితంగా బీఆర్ఎస్ పరిధిలోనే పనిచేయాల్సి ఉంటుందని, తన పేరుతో పలు సంస్థల ద్వారా చేస్తున్న కార్యక్రమాలను ఆపేయాలని పేర్కొన్నారు.







.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!