
రాజకీయాలు

పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగలబోతుందని బీజేపీ ఎంపీ సౌమిత్రా ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీకి చెందిన సుమారు 20 మంది ఎంపీలు, 50 మంది ఎమ్మెల్యేలు బీజేపీతో సంప్రదింపులు జరుపుతున్నారని ఆయన తెలిపారు.
టీఎంసీ నేతలు ప్రస్తుతం పార్టీపై అసంతృప్తిగా ఉన్నారని, వారిలో చాలామంది ఇప్పటికే తమతో టచ్లో ఉన్నారని సౌమిత్రా ఖాన్ పేర్కొన్నారు. సరైన సమయం వచ్చినప్పుడు పెద్ద సంఖ్యలో నాయకులు పార్టీ మారే అవకాశం ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
అయితే ఈ వ్యాఖ్యలను టీఎంసీ తీవ్రంగా ఖండించింది. ఇది పూర్తిగా తప్పుడు ప్రచారం అని, అలాంటి ఫిరాయింపులు జరగవని టీఎంసీ నేతలు స్పష్టం చేశారు. గత రాజకీయ అనుభవాలను గుర్తుచేస్తూ ఈసారి కూడా పార్టీ ఐక్యంగా ఉందని తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!