
న్యూస్

పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన సందర్భంగా జరిగిన పరిణామాల పై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలకు సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. రాష్ట్రపతి పదవిని రాజకీయాల కోసం ఉపయోగిస్తున్నారని బీజేపీ పై ఆమె ఆరోపించారు.
రాష్ట్రపతికి తగిన గౌరవం తమ ప్రభుత్వం ఎప్పుడూ ఇస్తుందని మమత అన్నారు. అయితే ఎన్నికల సమయంలో ఇలాంటి అంశాలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించడం సరైంది కాదని పేర్కొన్నారు. బెంగాల్ ప్రభుత్వం పై వచ్చిన ప్రోటోకాల్ ఉల్లంఘన ఆరోపణలను ఆమె ఖండిస్తూ, ఈ వివాదాన్ని బీజేపీ రాజకీయంగా ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఈ అంశం ప్రస్తుతం కేంద్ర–రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారితీసింది.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!