

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మలేషియాలో జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు కరువులు, వలసలతో ఇబ్బందులు ఎదుర్కొన్న తెలంగాణను దేశానికి అన్నపూర్ణగా మార్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. వ్యవసాయం, పరిశ్రమలు, సాగునీటి ప్రాజెక్టులు వంటి ప్రతి రంగంలో తెలంగాణను అగ్రస్థానంలో నిలిపింది కేసీఆర్ నాయకత్వమేనని స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధిపై అవగాహన లేకుండా కొందరు నాయకులు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కూడా కేసీఆర్ నాయకత్వంలో జరిగిన ప్రజాస్వామ్య ఉద్యమం వల్లే సాధ్యమైందని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రపంచంలో సింగపూర్, మలేషియా వంటి చిన్న దేశాలు సాధించిన విజయాల మాదిరిగానే తెలంగాణ కూడా తక్కువ కాలంలోనే అద్భుత ప్రగతి సాధించిందని అన్నారు. పామాయిల్ ఉత్పత్తి రంగంలో తెలంగాణ దేశంలో ముందంజలో నిలవడానికి మలేషియాతో ఉన్న అనుబంధం కూడా కారణమని తెలిపారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, పోరాట స్ఫూర్తిని ప్రతి తరం కొనసాగించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!