
సినిమాలు

ఆంధ్రప్రదేశ్లో నాలుగు కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీల్లో రిజర్వేషన్ల ఖరారుకు అధికారులు ప్రత్యేక షెడ్యూల్ను రూపొందించారు. ఇందులో భాగంగా ఈ నెల 25, 26 తేదీల్లో వార్డుల వారీగా ఇంటింటి సర్వే నిర్వహించనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్లను గుర్తించేందుకు ఈ సర్వే చేపట్టనున్నారు.
ఈ నెల 27న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు. 28న జాబితాలపై ఫిర్యాదులు, అభ్యంతరాలను స్వీకరిస్తారు. అనంతరం 29న తుది ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు. ఈ ప్రక్రియ ద్వారా ఆయా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల ఖరారుకు అవసరమైన సమాచారాన్ని సేకరించనున్నారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!