24, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏఐ ప్రాజెక్టుల ఊతంతో ఇన్ఫోసిస్‌ లాభాల్లో వృద్ధి

Writer: Nithish 07:41 AM, 24 అక్టోబర్, 2026
ఏఐ ప్రాజెక్టుల ఊతంతో ఇన్ఫోసిస్‌ లాభాల్లో వృద్ధి

ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ 2026 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో మెరుగైన ఆర్థిక ఫలితాలను నమోదు చేసింది. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత నికర లాభం గత ఏడాది ఇదే కాలంలోని రూ.7,364 కోట్లతో పోలిస్తే 6.2 శాతం పెరిగి రూ.7,823 కోట్లకు చేరింది. కార్యకలాపాల ఆదాయం 10.2 శాతం వృద్ధితో రూ.44,490 కోట్ల నుంచి రూ.49,244 కోట్లకు పెరిగింది. కృత్రిమ మేధ (ఏఐ) విభాగం కంపెనీ మొత్తం ఆదాయంలో 10.5 శాతం వాటా సాధించగా, త్రైమాసిక ప్రాతిపదికన 29 శాతం వృద్ధిని నమోదు చేసింది. సంస్థ ఏఐ సేవలను విస్తరించడం, ముఖ్యంగా సైబర్‌ సెక్యూరిటీ రంగంలో పెరుగుతున్న అవకాశాలు ఈ వృద్ధికి దోహదం చేశాయని ఇన్ఫోసిస్‌ సీఈఓ, ఎండీ సలీల్‌ పరేఖ్‌ తెలిపారు.

జులై–సెప్టెంబరు త్రైమాసికంలో ఇన్ఫోసిస్‌ భారీ ఒప్పందాల విలువ 5.2 బిలియన్‌ డాలర్లకు చేరింది. ఇందులో ఏడేళ్ల కాలానికి సంబంధించిన 2 బిలియన్‌ డాలర్లకు పైగా విలువైన మెగా ఒప్పందం కూడా ఉంది. కంపెనీ నిర్వహణ మార్జిన్‌ 21 శాతంగా కొనసాగింది. అయితే, అమెరికా మార్కెట్లో డిమాండ్‌ మందగించడంతో పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఆదాయ వృద్ధి అంచనాను స్థిర కరెన్సీ ప్రాతిపదికన 1.5–3 శాతం నుంచి 1–2 శాతానికి తగ్గించింది. నిర్వహణ మార్జిన్‌ అంచనాను 20–22 శాతంగా కొనసాగించింది. సమీక్షా త్రైమాసికంలో నికరంగా 4,000 మంది ఉద్యోగులు పెరగగా, కళాశాలల నుంచి 8,000 మందిని నియమించుకున్నట్లు పరేఖ్‌ తెలిపారు. పూర్తి ఆర్థిక సంవత్సరంలో 20,000 మంది ఫ్రెషర్ల నియామకమే లక్ష్యమని వెల్లడించారు. మరోవైపు, ఒక్కో షేరుకు రూ.26 మధ్యంతర డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 13 శాతం అధికం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జియో ప్లాట్‌ఫామ్స్‌ ఐపీఓకు భారీ స్పందన, దరఖాస్తుల్లో రికార్డు

జియో ప్లాట్‌ఫామ్స్‌ ఐపీఓకు భారీ స్పందన, దరఖాస్తుల్లో రికార్డు

ఐపీఓ చరిత్రలో జియో సరికొత్త రికార్డు..

ఐపీఓ చరిత్రలో జియో సరికొత్త రికార్డు..

పెరిగిన స్మార్ట్‌ఫోన్‌ ధరలు.. దశాబ్ద కనిష్ఠానికి భారత మార్కెట్‌!

పెరిగిన స్మార్ట్‌ఫోన్‌ ధరలు.. దశాబ్ద కనిష్ఠానికి భారత మార్కెట్‌!

మధ్యతరగతికి పన్ను ఊరట.. మోదీ సర్కారు కీలక నిర్ణయం

మధ్యతరగతికి పన్ను ఊరట.. మోదీ సర్కారు కీలక నిర్ణయం

వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..
ట్యాగ్లు
ఇన్ఫోసిస్ఏఐ ప్రాజెక్టులుఇన్ఫోసిస్ లాభాలుసలీల్ పరేఖ్ఐటీ రంగంకృత్రిమ మేధభారీ కాంట్రాక్టులుఉద్యోగ నియామకాలుమధ్యంతర డివిడెండ్కంపెనీ ఆర్థిక ఫలితాలు
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..

భారతీయ రైల్వేలో చారిత్రాత్మక ఘట్టం..రైల్వే నెట్‌వర్క్‌తో రోఘాట్ అనుసంధానం

భారతీయ రైల్వేలో చారిత్రాత్మక ఘట్టం..రైల్వే నెట్‌వర్క్‌తో రోఘాట్ అనుసంధానం

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రాంతీయ కథలు.. అందరికీ చేరువయ్యే మార్గమిదే?
సినిమాలు

ప్రాంతీయ కథలు.. అందరికీ చేరువయ్యే మార్గమిదే?

బాక్సాఫీస్ పతనం.. భద్రతా భారం.. సల్మాన్‌కు సవాళ్లు?
సినిమాలు

బాక్సాఫీస్ పతనం.. భద్రతా భారం.. సల్మాన్‌కు సవాళ్లు?

ఇరాన్‌పై దాడుల విషయంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు
జనరల్

ఇరాన్‌పై దాడుల విషయంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు

ఆసియాలో వరుస భూకంపాలు.. పలు ప్రాంతాల్లో ప్రకంపనలు
జనరల్

ఆసియాలో వరుస భూకంపాలు.. పలు ప్రాంతాల్లో ప్రకంపనలు

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో విదేశీ కరెన్సీ పట్టివేత
జనరల్

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో విదేశీ కరెన్సీ పట్టివేత

నిమిషాల్లోనే అమ్ముడైన ఆపిల్ ఫోల్డబుల్ ఫోన్
టెక్నాలజీ

నిమిషాల్లోనే అమ్ముడైన ఆపిల్ ఫోల్డబుల్ ఫోన్

పారా ఆసియా క్రీడల్లో భారత్‌ ఘనత
క్రీడలు

పారా ఆసియా క్రీడల్లో భారత్‌ ఘనత

ఏపీలో రిజర్వేషన్ల ఖరారుకు ప్రత్యేక షెడ్యూల్
జనరల్

ఏపీలో రిజర్వేషన్ల ఖరారుకు ప్రత్యేక షెడ్యూల్

పీఎం కిసాన్‌ నిధుల విడుదలపై కీలక ప్రకటన
జనరల్

పీఎం కిసాన్‌ నిధుల విడుదలపై కీలక ప్రకటన

తిరుమలలో భారీ రద్దీ
జనరల్

తిరుమలలో భారీ రద్దీ

రాయలసీమకు భారీ పెట్టుబడులు
జనరల్

రాయలసీమకు భారీ పెట్టుబడులు

ఏఐ ప్రాజెక్టుల ఊతంతో ఇన్ఫోసిస్‌ లాభాల్లో వృద్ధి
బిజినెస్

ఏఐ ప్రాజెక్టుల ఊతంతో ఇన్ఫోసిస్‌ లాభాల్లో వృద్ధి