

రష్యాను ఓడించే శక్తి ఐరోపా దేశాలకు లేదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. రష్యాతో యుద్ధం చేయాల్సి వస్తుందంటూ ఐరోపా దేశాలు చేస్తున్న ప్రకటనలను ఆయన తప్పుబట్టారు. ఈ వ్యాఖ్యలు ఆయా దేశాల్లోని రాజకీయ, మానసిక అస్థిరతను ప్రతిబింబిస్తున్నాయని ఎద్దేవా చేశారు. రష్యా నుంచి ముప్పు పొంచి ఉందంటూ ఐరోపా దేశాలు పదేపదే భయాందోళనలు సృష్టిస్తున్నాయని విమర్శించారు. ఓ జర్నలిస్టుతో పుతిన్ జరిపిన సంభాషణకు సంబంధించి ఓ వార్తాసంస్థ ప్రచురించిన కథనంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి.
గతంలో రష్యాను ఓడించేందుకు ప్రయత్నించిన ఐరోపా దేశాలు.. చివరకు తమతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించడమే మంచిదని గుర్తించాయని పుతిన్ పేర్కొన్నారు. ఇప్పుడూ అదే పరిస్థితి పునరావృతమవుతుందని వ్యాఖ్యానించారు. మరోవైపు, ఉక్రెయిన్‌ను తమ సోదర దేశంగా అభివర్ణించిన ఆయన.. ఆ దేశంతో కొనసాగుతున్న యుద్ధానికి పరిష్కారం కనుగొనేందుకు అమెరికా మధ్యవర్తిత్వంలో చర్చలు జరిపేందుకు రష్యా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!