

కేటీఆర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరియు కరీంనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయాలపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ దాడికి కేంద్ర మంత్రి బండి సంజయ్ అనుచరులే కారణమని ఆరోపించారు. ఘటన జరిగిన వెంటనే కౌశిక్ రెడ్డితో మాట్లాడినట్లు తెలిపారు. పట్టపగలు గుండాల మాదిరిగా క్యాంప్ కార్యాలయంలోకి వెళ్లి వాహనాలు, ఆఫీసును ధ్వంసం చేయడం చాలా దారుణమని అన్నారు.
ఈ ఘటన జరుగుతుండగా పోలీసులు ఏమి చేయకుండా చూస్తూ ఉండటం సిగ్గుచేటని కేటీఆర్ విమర్శించారు. బీఆర్ఎస్ నేతలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే బండి సంజయ్ ఇలాంటి చర్యలకు ప్రేరేపిస్తున్నారని ఆరోపించారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి శాంతి భద్రతలను కాపాడాల్సింది పోయి వాటిని దెబ్బతీయడం ప్రజాస్వామ్యానికి అవమానమని కేటీఆర్ అన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!