

తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుకు పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా అక్టోబర్ 10, 11 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా జిల్లా దశాబ్ది కార్యక్రమాలు నిర్వహించాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ నాయకులు, శ్రేణులకు సూచించారు. తెలంగాణ సాధనలో అధికార వికేంద్రీకరణ కీలక ఆశయమని, ప్రజలకు పరిపాలనను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం పరిపాలనా సంస్కరణలు చేపట్టిందని ఆయన పేర్కొన్నారు. 2016లో తెలంగాణలోని 10 జిల్లాలను 31 జిల్లాలకు పెంచగా, 2019లో ములుగు, నారాయణపేట జిల్లాల ఏర్పాటుతో మొత్తం జిల్లాల సంఖ్య 33కు చేరింది.
ప్రతి జిల్లా కేంద్రంలో దశాబ్ది కార్యక్రమాలు నిర్వహించి, జిల్లాల కోసం ఉద్యమించిన జేఏసీలు, ఉద్యమకారులను సన్మానించాలని కేటీఆర్ సూచించారు. బార్ అసోసియేషన్లు, జర్నలిస్టులు, ఉద్యోగులు, పెన్షనర్లు, మహిళా, యువజన సంఘాలతో పాటు కవులు, కళాకారులు, సామాజిక కార్యకర్తలను కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయాలని తెలిపారు. గత పదేళ్లలో జిల్లాల వారీగా జరిగిన అభివృద్ధిని “అప్పుడు–ఇప్పుడు” విధానంలో ప్రజలకు వివరించాలని, స్థానిక మీడియా, సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!