
జనరల్

సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని విమానాశ్రయంపై అక్టోబర్ 10న హూతీలు జరిపిన దాడిలో గాయపడిన మరో భారతీయుడు చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ తాజా మరణంతో ఘటనలో ప్రాణాలు కోల్పోయిన భారతీయుల సంఖ్య రెండుకు చేరింది. ఈ దాడిలో మొత్తం 10 మంది భారతీయులు గాయపడినట్లు సమాచారం.
ఇప్పటికే ఈ ఘటనలో హైదరాబాద్‌కు చెందిన యూసఫ్ అలీ మరణించారు. తాజాగా మృతి చెందిన భారతీయుడి వివరాలను భారత రాయబార కార్యాలయం వెల్లడించలేదు. మృతదేహాన్ని భారత్‌కు తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనతో సౌదీ అరేబియాలోని భారతీయుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!