
.jpg&w=3840&q=75)
సున్నం చెరువు ప్రాంతంలో జరుగుతున్న కూల్చివేతలు మరియు ఫెన్సింగ్ చర్యల పై హైడ్రాకు హైకోర్టు తీవ్రంగా అభ్యంతరం తెలిపినట్లు సమాచారం. కోర్టు ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలను పట్టించుకోకుండా చర్యలు తీసుకోవడం రాజ్యాంగ హక్కులకు విరుద్ధమని కోర్టు వ్యాఖ్యానించినట్లు తెలిసింది.
హైకోర్టు ప్రశ్నించిన ముఖ్యాంశాలు ఇవి:
కోర్టు ఆదేశాలు అమల్లో ఉన్నప్పటికీ ఫెన్సింగ్ ఎలా వేయించారు.
గ్రీన్ ట్రిబ్యునల్ నివేదికను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు.
ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎంత ఉందన్న నిర్ధారణ జరగకముందే హద్దులు ఎలా నిర్ణయించారు.
హద్దుల పై స్పష్టత కోసం సర్వే నిర్వహించేందుకు ఎందుకు చర్యలు తీసుకోలేదు.
సున్నం చెరువు సియేట్ కాలనీలో నివసిస్తున్న ప్రజలపై తీసుకుంటున్న చర్యలు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 300-A ప్రకారం ఆస్తి హక్కుల ఉల్లంఘనగా మారుతాయని కోర్టు స్పష్టం చేసింది. ప్రజల స్థలాల్లో ఫెన్సింగ్ వేయడం, కూల్చివేతలు చేపట్టడం వంటి చర్యలను తక్షణం నిలిపేయాలని హైడ్రాను హైకోర్టు హెచ్చరించింది.




.jpeg&w=3840&q=75)















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!