

తమిళ రాజకీయాలు, సినీ వర్గాల్లో ప్రస్తుతం దళపతి విజయ్ గురించే చర్చ సాగుతోంది. ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) పార్టీతో తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించిన విజయ్, రాబోయే ఎన్నికల్లో విజయం లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు. అయితే ఈ సమయంలో ఆయన వ్యక్తిగత జీవితంలో అనుకోని పరిణామం చోటుచేసుకుంది. విజయ్‌తో విడాకులు కావాలంటూ ఆయన భార్య సంగీత కోర్టును ఆశ్రయించడం చర్చనీయాంశమైంది. దీంతో విజయ్ ఒకేసారి వ్యక్తిగత, రాజకీయ జీవితాల్లో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాడని చెప్పవచ్చు. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, రాబోయే ఏప్రిల్ నెల ఆయన జీవితంలో కీలక మలుపు తిప్పే అవకాశం ఉంది.
ఏప్రిల్ 20న విజయ్ విడాకుల కేసుకు సంబంధించి తుది తీర్పు వచ్చే అవకాశముందని సమాచారం. గత కొంతకాలంగా విజయ్, సంగీత వేర్వేరుగా ఉంటున్నారనే వార్తల నేపథ్యంలో, ఈ తీర్పుతో వారి సంబంధానికి అధికారిక ముగింపు లభించనుంది. ఈ పరిస్థితుల్లో వ్యక్తిగతంగా ఒంటరి జీవితం ప్రారంభమవుతుండగా, రాజకీయాల్లో కూడా ఆయన ‘ఒంటరి పోరాటం’కే సిద్ధమవుతున్నాడు. ఎలాంటి పొత్తులు లేకుండా ఎన్నికల బరిలోకి దిగాలనే నిర్ణయం తీసుకోవడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
విడాకుల విషయంపై స్పందించిన విజయ్, “నా కోసం ఎవరూ బాధపడొద్దు. మీరు బాధపడితే నేను తట్టుకోలేను. నా సమస్యలను నేనే పరిష్కరించుకోగలను” అంటూ అభిమానులకు ధైర్యం చెప్పారు. భార్యతో సంబంధం ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో, ఏప్రిల్ 23న జరగనున్న పోలింగ్‌లో ప్రజలు ఇచ్చే తీర్పుపై ఆసక్తి నెలకొంది. వ్యక్తిగత సమస్యలను పక్కన పెట్టి ప్రజల కోసం పోరాడుతున్న విజయ్‌కు ఓటర్లు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!