

రాహుల్‌గాంధీని భవిష్యత్ ప్రధానమంత్రిగా చూడాలన్న ఆకాంక్ష దేశంలో ఉందని తెలంగాణ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో ఆదివారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువలు, ప్రజల హక్కుల కోసం రాహుల్‌గాంధీ పోరాడుతున్నారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం అంటే కేవలం ఎన్నికలు నిర్వహించడం మాత్రమే కాదని, ఎన్నికల వ్యవస్థపై విశ్వాసం, స్వతంత్ర సంస్థల పనితీరు, ప్రజల అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేసే అవకాశం కూడా ముఖ్యమని అన్నారు. ఓటరు జాబితాలు, ఎన్నికల నిర్వహణపై రాహుల్‌గాంధీ లేవనెత్తిన ప్రశ్నలకు పారదర్శకంగా సమాధానాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఉత్తమ్ పేర్కొన్నారు.
రాజకీయ దాడులు, విమర్శలు ఎదురైనా రాహుల్‌గాంధీ ప్రజల సమస్యలపై పోరాటం కొనసాగిస్తున్నారని ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. తెలంగాణలోని ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ బలోపేతానికి పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలు, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియపై రాహుల్‌గాంధీ చేసిన ‘ఓట్ చోరీ’ ఆరోపణలను ప్రస్తావిస్తూ, ఓటర్ల హక్కులకు సంబంధించిన అంశాలపై సంబంధిత సంస్థలు పారదర్శకంగా సమాధానం ఇవ్వాలని ఆయన కోరారు. ఈ ఆరోపణలను బీజేపీ తిరస్కరిస్తోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!