
జనరల్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలంగాణపై చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం తీవ్ర స్థాయిలో స్పందించారు. మా జమీన్, జాగీర్ తెలంగాణలో ఉన్నాయని పేర్కొంటూ, పవన్ కళ్యాణ్ తండ్రి, తాతల పుట్టుక ఎక్కడ జరిగిందో చెప్పాలని ప్రశ్నించారు. ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ తెలంగాణపై దిగజారి మాట్లాడడం తగదని విమర్శించారు.
తెలంగాణపై విషం చిమ్మడంలో బీజేపీ, పవన్ కళ్యాణ్ ఇద్దరూ ఒకే విధానాన్ని అనుసరిస్తున్నారని వీరేశం ఆరోపించారు. బీఆర్ఎస్‌ను రాజకీయంగా బతికించేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధైర్యసాహసాల వల్లే కేసీఆర్‌ను గద్దె దించగలిగారని కొనియాడారు. జాతీయ రాజకీయాల్లో కూడా రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసే శక్తి కలిగిన నాయకుడని వ్యాఖ్యానించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!