
జనరల్

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టీవీకే (తమిళగ వెట్రి కళగం) నేతృత్వంలో కొత్త రాజకీయ కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు వేగం పుంజుకున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి విజయ్ నేడు మిత్రపక్షాల అగ్రనేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో మారుతున్న సమీకరణలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించనున్నట్లు సమాచారం.
డీఎంకే రాజకీయ వ్యూహాలకు సమర్థంగా ఎదురుదెబ్బ ఇవ్వడంతో పాటు ప్రభుత్వాన్ని మరింత బలోపేతం చేసే కార్యాచరణపై సమావేశంలో నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సమావేశానికి వివిధ రాజకీయ పార్టీల ముఖ్య నాయకులను మంత్రులు ఆనంద్, ఆదవ్ స్వయంగా ఆహ్వానించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ భేటీ తమిళనాడు రాజకీయాల్లో కొత్త కూటమి సమీకరణాలకు దారితీయవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!