

దేశవ్యాప్తంగా రేషన్ ద్వారా సన్న బియ్యాన్ని పంపిణీ చేయాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. గురువారం ఉదయం సీఎం రేవంత్ రెడ్డి హోటల్ తాజ్‌కృష్ణలో కేంద్ర మంత్రితో సమావేశమయ్యారు. ఈ సందర్భంలో తెలంగాణలో అమలవుతున్న సన్న బియ్యం పంపిణీ విధానం గురించి సీఎం వివరించారు.
రాష్ట్రంలోని రేషన్ షాపుల్లో వినియోగదారులకు నేరుగా సన్న బియ్యం అందిస్తున్నది తెలంగాణ మాత్రమేనని, ప్రజలు నిజంగా తినే నాణ్యమైన బియ్యాన్ని ఇవ్వడం ద్వారా సంక్షేమ పథకాల అసలు ఉద్దేశం నెరవేరుతుందని సీఎం రేవంత్ చెప్పారు. తెలంగాణలో ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్న దృష్ట్యా, కేంద్రం కూడా దేశమంతటా సన్న బియ్యం పంపిణీ చేయడం పరిశీలించాలని సీఎం కోరారు.
అవసరమైతే ఈ విషయాన్ని అధ్యయనం చేసి తగిన నిర్ణయం తీసుకోవాలని రేవంత్ వినతిపెట్టగా, కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి దీనిపై సానుకూలంగా స్పందించారు. పూర్తి స్థాయి పరిశీలన తర్వాత దేశవ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీ అంశంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
ఈ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తెలంగాణలో ఇప్పటికే ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి వ్యక్తికి నెలకు 6 కిలోల సన్న బియ్యాన్ని అందిస్తోంది. ఎన్నికల హామీ మేరకు ఈ కార్యక్రమం ఈ ఏడాది ఏప్రిల్ 1 నుండి రాష్ట్రవ్యాప్తంగా అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే.




.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!