

వందేమాతరం గీతం ఆలాపనపై కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ వ్యవహరించిన తీరుపై బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ తీవ్ర విమర్శలు చేశారు. ఆగస్టు 15న కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వందేమాతరం ఆలాపన సందర్భంగా సోనియా స్పందన అభ్యంతరకరంగా అనిపించిందని అన్నారు. వందేమాతరాన్ని పూర్తిగా ఆలపించడాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తున్నట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. జాతీయ గౌరవానికి సంబంధించిన అంశంలో కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన పరిణామం అవమానకరమని విమర్శించారు.
కాంగ్రెస్ మీడియా విభాగం ఇచ్చిన వివరణను కూడా రవిశంకర్ ప్రసాద్ తప్పుబట్టారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కోసం కుర్చీ ఏర్పాటు చేస్తున్నందువల్లే అలా జరిగిందన్న వివరణను ఆయన కొట్టిపారేశారు. గోవాలో జరిగిన కాంగ్రెస్ కార్యక్రమంలోనూ వందేమాతరంలోని రెండు చరణాలే ఆలపించారని ప్రస్తావించారు. ఇలాంటి ఘటనలు కొనసాగితే స్వాతంత్య్ర ఉద్యమానికి తామే ఏకైక వారసులమని చెప్పుకోవడం కాంగ్రెస్ మానుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!