
సినిమాలు

బండి సంజయ్ తన కుమారుడు బండి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసు నేపథ్యంలో స్పందించారు. తన కుమారుడిని నేరస్థుడిగా చూపించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని కోరారు. “ఏ తప్పూ చేయలేదని నా కుమారుడు చెబుతున్నాడు. అయితే నేను అతడిని సమర్థించడం లేదు. చట్టాన్ని, న్యాయవ్యవస్థను గౌరవిస్తాం. కోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని పాటిస్తాం” అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
తన కుమారుడిపై జరుగుతున్న దాడులను చూసి కుటుంబం తీవ్ర మానసిక వేదనకు గురవుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి తమ కుటుంబాన్ని డిప్రెషన్లోకి నెట్టిందన్నారు. అదే సమయంలో కుట్రలు చేసి తన కుటుంబం, పార్టీని ఇబ్బంది పెట్టే వారిని వదిలిపెట్టబోనని హెచ్చరించారు. చట్ట ప్రకారం దర్యాప్తు, చర్యలు కొనసాగవచ్చని స్పష్టం చేస్తూ చివరకు నిజం బయటపడుతుందని అన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!