

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు గర్వ క్షణం వచ్చింది. తన భార్య నారా భువనేశ్వరి లండన్ వేదికపై రెండు ప్రతిష్టాత్మక అవార్డులు అందుకొని కుటుంబానికే కాకుండా రాష్ట్రానికీ గౌరవం తీసుకువచ్చారు. సాధారణంగా రాజకీయ నేతల భార్యలు వ్యాపార కార్యకలాపాల నుండి దూరంగా ఉంటారు. కానీ భువనేశ్వరి మాత్రం హెరిటేజ్ ఫుడ్స్ వ్యాపారాన్ని తన కోడలు బ్రాహ్మణితో కలిసి సమర్థంగా నడుపుతున్నారు. ఈ క్రమంలో ఆమెకు లండన్‌లో రెండు అవార్డులు లభించాయి. మొదటిది IOD Distinguished Fellow Award — ఇది ఆమె సామాజిక సేవా దృక్పథం, నాయకత్వం, ప్రజా సేవా కృషికి గుర్తింపుగా ఇచ్చిన గౌరవం. రెండవది Golden Peacock Award for Excellence in Corporate Governance 2025, ఇది హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్‌కు నైతిక పరిపాలన, పారదర్శక వ్యాపార విధానాలపై కట్టుబాటుకు గుర్తింపుగా ప్రదానం చేశారు.
భువనేశ్వరి తన వ్యాపార నైపుణ్యానికి తోడు సేవాభావాన్ని కలిపి స్ఫూర్తిదాయక నాయకురాలిగా నిలుస్తున్నారు. ఈ విజయాలతో బాబు ఆనందభాష్పాలు ఆపుకోలేకపోయారంటూ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.








.avif&w=3840&q=75)


కామెంట్స్ (1)
Proud moment!