
టెక్నాలజీ

సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన OG బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు సాధిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్స్ భారీగా స్పందిస్తున్నారు.అయితే, మాజీ మంత్రి అంబటి రాంబాబు తన అభిప్రాయాన్ని వెల్లడించారు. సినిమా విడుదలకు ముందు పెద్ద హిట్ కావాలని ఆకాంక్షించిన ఆయన, ఇప్పుడు మాత్రం ఈ చిత్రం పవన్ అభిమానులను మాత్రమే ఆకట్టుకుందని, సాధారణ ప్రేక్షకులకు నచ్చలేదని అన్నారు.తన అభిప్రాయం పట్ల పవన్ అభిమానులు ఏకీభవించకపోవచ్చని, కానీ నిజాన్ని అంగీకరించకపోవడం “వెర్రితనం” అని ఆయన వ్యాఖ్యానించారు.
ఎక్స్ (ట్విట్టర్) లో రాంబాబు పోస్ట్ చేస్తూ, పవన్ రాజకీయ ప్రత్యర్థి అయినా సినిమా విజయం సాధించాలని కోరుకున్నానని, కానీ చివరికి నిరాశే మిగిలిందని అన్నారు. చివరగా ఆయన “దానయ్య.. దండగ పడ్డావయ్యా” అంటూ తన ట్వీట్ ముగించారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!