

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రతిష్ఠాత్మక అంతరిక్ష ప్రయోగానికి సిద్ధమవుతోంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి అక్టోబర్ 30న జీఎస్ఎల్వీ-ఎఫ్18 రాకెట్‌ను ప్రయోగించేందుకు శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ రాకెట్ ద్వారా నావిగేషన్ సేవలకు ఉపయోగపడే ఎన్‌వీఎస్-03 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. దేశీయ నావిగేషన్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే ఈ ప్రయోగం ప్రధాన లక్ష్యం.
ఇప్పటికే శ్రీహరికోటలోని వెహికల్ అసెంబ్లీ బిల్డింగ్‌లో రాకెట్‌కు సంబంధించిన మూడు దశల అనుసంధాన ప్రక్రియను శాస్త్రవేత్తలు పూర్తి చేశారు. అనంతరం రాకెట్‌ను రెండో ప్రయోగ వేదికపైకి తరలించి, వివిధ సాంకేతిక పరీక్షలు, ప్రయోగానికి ముందు చేపట్టాల్సిన ప్రక్రియలను నిర్వహిస్తున్నారు. ఇస్రో వర్గాల సమాచారం ప్రకారం అక్టోబర్ 30వ తేదీ రాత్రి 11:55 గంటలకు ప్రయోగం చేపట్టే అవకాశం ఉంది. ఈ ప్రయోగం విజయవంతమైతే భారత నావిగేషన్ సేవల అభివృద్ధితో పాటు దేశ అంతరిక్ష పరిశోధన కార్యక్రమంలో మరో కీలక ముందడుగు పడనుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!