

ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తన పోటీపై కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో విద్యార్థులతో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానో లేదో తెలియదని, ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచన కూడా లేదని చెప్పారు. “నేను ముసలోడిని అయిపోయాను.. పోటీ చేయను” అంటూ చేసిన వ్యాఖ్యలు హైదరాబాద్ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి.
అదే కార్యక్రమంలో అక్బరుద్దీన్ ఓవైసీ తన విద్యాభ్యాసం, రాజకీయ ప్రస్థానం గురించి కూడా మాట్లాడారు. తాను 12వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నానని తెలిపారు. అయితే రాజకీయాల్లో తాను ఎదిగిన స్థాయిని ప్రస్తావిస్తూ.. తాను ఏం మాట్లాడినా ముఖ్యమంత్రి సమాధానం చెప్పాల్సిన స్థాయికి చేరుకున్నానని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీపై ఆయన ప్రస్తుతం చేసిన వ్యాఖ్యలే అందుబాటులో ఉండగా, ఎన్నికల సమయానికి ఆయన తుది నిర్ణయం ఏమిటన్నది ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!