

రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ధాన్యం కొనుగోలులో గత సంవత్సరాల్లో ఎదురైన సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఈసారి ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్టు చెప్పారు. “రైతులకు గోనె సంచులు కొరత ఉండకుండా 6 కోట్ల సంచులు సిద్ధంగా ఉంచాం. వర్షాలు కురిసినప్పుడు ధాన్యం తడవకుండా కాపాడటానికి 50 వేల టార్పాలిన్లు కూడా సిద్ధంగా ఉన్నాయి. అవసరమైతే రైతులకు ఉచితంగా వాటిని అందిస్తాం,” అని మంత్రి తెలిపారు. ధాన్యంలో తేమ శాతం కొలిచే యంత్రాల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకున్నామని నాదెండ్ల పేర్కొన్నారు. “ఒకే కంపెనీకి చెందిన మిషన్లను వాడాలని నిర్ణయించాం. దీనివల్ల కొలతల్లో గందరగోళం ఉండదు,” అన్నారు.
ప్రజా పంపిణీ అవసరాల కోసం ఈ ఖరీఫ్ సీజన్లో రైతుల నుంచి రూ.12,200 కోట్ల విలువైన 51 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం ప్రణాళిక వేసిందని ఆయన వివరించారు. ధాన్యం కొనుగోలు దశలవారీగా జరుగుతుందని తెలిపారు —
నవంబరులో 11 లక్షల టన్నులు
డిసెంబరులో 25 లక్షలు
జనవరిలో 8 లక్షలు
ఫిబ్రవరిలో 3 లక్షలు
మార్చిలో 4 లక్షల టన్నులు కొనుగోలు చేయనున్నారు.
“ప్రతి రైతు ధాన్యం సురక్షితంగా కొనుగోలు అవుతుంది. వర్షాలు, మార్కెట్ లేదా యంత్రాంగ సమస్యల వల్ల రైతు నష్టపోకుండా చర్యలు తీసుకుంటాం,” అని నాదెండ్ల మనోహర్ హామీ ఇచ్చారు.










కామెంట్స్ (2)
Good to see the government taking care of farmers’ needs!
Smart Planning