

ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో అనేది ఒక ఫుల్ కామెడీ ఎంటర్టైనర్. హై-ప్రొఫైల్ కపుల్‌కి ప్రీ-వెడ్డింగ్ వీడియో షూట్ చేసిన ఒక లోకల్ ఫోటోగ్రాఫర్‌కి, ఆ వీడియో ఉన్న మెమరీ కార్డ్ పోవడంతో కథలో ఫన్ మొదలవుతుంది. మెమరీ కార్డ్ ఎక్కడ పోయింది? ఎవరి దగ్గరుంది? ఇప్పుడు ఆ మిస్సింగ్ మెమరీ కార్డ్‌ని వెతికేందుకు హీరో పడే ప్రయత్నాలతో స్క్రీన్‌పై సటైర్లు, ఫన్నీ సీన్లు, టైమ్‌పాస్ ఎంటర్టైన్మెంట్ వరుసగా సాగుతాయి.నిజ జీవితానికి దగ్గరగా ఉండే హాస్యం ఈ సినిమాకి పక్కా హైలైట్.
తిరువీర్ ఈ సినిమాలో కూడా తన నేచురల్ స్టైల్‌తో ఆకట్టుకుంటున్నాడు. హీరోయిన్ టీనా శ్రావ్య, మాస్టర్ రోహన్ రాయ్, నరేంద్ర రవి పాత్రలు కూడా కామెడీకి మంచి హైలైట్ అవుతాయి. ఫ్యామిలీతో కూర్చొని నవ్వుల వర్షం కురిపించే సినిమా కావడంతో ఓటీటీలో మంచి రెస్పాన్స్ వస్తుందని టాక్. ఇక ఈ మూవీ డిసెంబర్ 5 నుంచి ZEE5 లో స్ట్రీమింగ్కి సిద్ధమైంది. టైమ్ పాస్ కోసం, నవ్వుల కోసం, తేలికగా చూడదగ్గ ఫీల్ గుడ్ కామెడీ కోసం చూస్తున్నవారికి ఈ సినిమా బాగానే నచ్చుతుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!