
సినిమాలు

సౌత్ స్టార్ హీరో సూర్య, త్రిష కృష్ణన్ ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ డ్రామా ‘కరుప్పు’ తెలుగులో ‘వీరభద్రుడు’ పేరుతో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మించింది. థియేటర్లలో యాక్షన్ సన్నివేశాలు, సూర్య నటన, భావోద్వేగ కథనం ప్రేక్షకులను ఆకట్టుకుని మంచి వసూళ్లు సాధించాయి.
తాజా సమాచారం ప్రకారం ‘వీరభద్రుడు’ జూన్ 12 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా స్టాండ్అలోన్ తెలుగు వెర్షన్‌ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. అల్ట్రా హెచ్‌డీ క్వాలిటీ, మెరుగైన ఆడియోతో విడుదల కానున్న ఈ చిత్రం ఓటీటీలో కూడా భారీ ఆదరణ పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!